నరసన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మంత్రి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ వర్థంతి వేడుకలను నిర్వహించారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఇందిరా గాంధీ అమలు చేసిన ఎన్నో అభివృద్ధి పనులు నేటికీ అవి చిరస్థాయిగా మిగిలిపోతాయని ఆయన వివరించారు.