ఎస్సీ వసతి గృహంలో మంచినీటి బోరు బావి ప్రారంభం

57చూసినవారు
ఎస్సీ వసతి గృహంలో మంచినీటి బోరు బావి ప్రారంభం
పోలాకి మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని స్థానిక ఎస్సీ వసతి గృహంలో మంచినీటి సదుపాయం అందించేందుకు నిర్మించిన బోరుబావిని మాజీ సర్పంచ్ కరుకోల రమేష్ ప్రారంభించారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో మంచినీటికి స్థానిక వసతి గృహ విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని సంక్షేమ అధికారి సిహెచ్ సత్యనారాయణ తన దృష్టికి తీసుకుని వచ్చారని తెలిపారు. ఈ క్రమంలో బోరుబావిని ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్