జలుమూరు మండల కేంద్రంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు

81చూసినవారు
జలుమూరు మండల కేంద్రంలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు
జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం పట్ల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం జలుమూరు మండల కేంద్రంలో ఈ మేరకు డాగ్ స్క్వాడ్ తో పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించామని వివరించారు. ప్రతి ఒక్క దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తత అవసరం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్