ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎక్సైజ్ శాఖ సీఐ రమణమూర్తి, ఎస్సై గురుమూర్తి తెలిపారు. బుధవారం నరసన్నపేట ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఈనెల తొమ్మిదో తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేశారు. ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు ధరావత్తు చెల్లించవలసి ఉంటుందని ఇది తిరిగి చెల్లించబడదని స్పష్టం చేశారు. నరసన్నపేటలో 12 షాపులు ఇవ్వడం జరిగిందన్నారు.