శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐలో ఆగస్టు సేశన్ కు సంబంధించి మొదటి కౌన్సిలింగ్ తరువాత మిగిన సీట్లలో ప్రవేశాలకు రెండో విడతలో ధరకాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐ కళాశాల డైరెక్టర్ రామ్మోహనరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై 24 లోపు ITI. GOV. AP. IN వెబ్ సైట్లో ధరకాస్తు చేసుకోవాలన్నారు. జూలై 25 లోపు శ్రీకాకుళం, ఇతర ప్రభుత్వ ఐటిఐలో అయినా పత్రాల పరిశీలన చేయించుకోవాలని అన్నారు.