జలుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించామని ఎంఈఓ వరప్రసాదరావు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ తరగతులను సోషల్ స్టడీస్ ఉపాధ్యాయురాలు ఎన్. వాసంతి పర్యవేక్షించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు.