జలుమూరు: రైతులకు రాయితీపై పశువుల దాణ అందజేత

57చూసినవారు
పాడి రైతులను అన్ని విధాల ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం జలుమూరు మండల కేంద్రంలోని స్థానిక పశు వైద్య కేంద్రం వద్ద రైతులకు పశువుల దాణాను అందజేశారు. ఆయన మాట్లాడుతూ 50 శాతం రాయితీతో వీటిని రైతులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లోకనాథం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్