పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు అంతా లక్ష్యంగా చేసుకోవాలని ఎంఈఓ బమ్మిడి మాధవరావు తెలిపారు. బుధవారం జలుమూరు మండలం కేంద్రంలోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు చదివే తీరును పరిశీలించారు. లక్ష్యసాధన ధ్యేయంగా విద్యపై దృష్టి సారించాలని అప్పుడే ఫలితాలు సాధించుకోగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.