జలుమూరు మండలం శ్రీముఖలింగం పంచాయతీలో పలు వీధులలో ఉపాధి నిధులతో రహదారుల నిర్మాణాలు చేపడుతున్నామని సర్పంచ్ తమన్న గారి సతీష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్థానిక వెలమ వీధిలో 15 లక్షల రూపాయలతో సిమెంట్ రహదారి పనులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సహకారంతో నిధులు మంజూరు అయ్యాయని ఆయన వివరించారు. పంచాయతీని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు.