జలుమూరు: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్లు పంపిణీ

77చూసినవారు
జలుమూరు: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్లు పంపిణీ
జలుమూరు మండలం అల్లాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను హెచ్ఎం పి రామకృష్ణారావు పంపిణీ చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కిట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనిఫామ్స్ తో పాటు పాఠ్యపుస్తకాలు నోట్స్ పుస్తకాలు కూడా అందించామని వివరించారు. త్వరలో స్కూల్ బ్యాగ్స్ కూడా అందజేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్