జలుమూరు మండలం సురవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని హెచ్ఎం బాడాన జగన్నాథం తెలిపారు. బుధవారం ఉదయం పాఠశాల పరిసర గ్రామాలలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో అందించే వివిధ అంశాలను వారికి తెలియజేశామని వివరించారు. ఈ క్రమంలో ఏడుగురు విద్యార్థులు తమ పాఠశాలలో చేరేందుకు సమ్మతి తెలిపారని ఆయన స్పష్టం చేశారు.