జలుమూరు మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలను నిర్వహించడం జరిగిందని ఎంఈఓ బమ్మిడి మాధవరావు తెలిపారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కమిటీతో పాటు సమీక్ష నిర్వహించడంతోపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.