పదో తరగతి పరీక్షలలో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించే దిశగా కృషి చేస్తున్నామని ఎంఈఓ బమ్మిడి మాధవరావు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం జలుమూరు మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఉషారాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ 19వ తేదీ నుండి సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయని, వాటికి సన్నద్ధం చేస్తున్నామన్నారు.