నరసన్నపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం అంగరంగ వైభవంగా కల్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం రాత్రి స్థానిక ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శివ పార్వతి, సీతారాములు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సతి సమేతంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.