కంచిలి: గొప్ప సంఘసంస్కర్త సావిత్రి బాయి ఫూలే

52చూసినవారు
కంచిలి: గొప్ప సంఘసంస్కర్త సావిత్రి బాయి ఫూలే
దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా సావిత్రి బాయి ఫూలే నిలిచారని కంచిలి ఎంఈఓ శివరాం ప్రసాద్ శుక్రవారం అన్నారు. గొప్ప సంఘసంస్కర్తగా గుర్తింపు పొందారని తెలిపారు. కంచిలిలోని ఎంఆర్సీ ఆవరణలో సావిత్రి బాయి ఫూలే జయంతి, జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలను ఎంఈఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్