నరసన్నపేటలోని స్థానిక శ్రీ ఉమా సహిత సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా ముత్తైదువులు స్థానిక ఆలయంలో జరిగిన కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు విభూది శంకర్ మాట్లాడుతూ. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి 51 చీరలతో అలంకరించారు. సాయంత్రం కూడా పూజలు జరుగుతాయన్నారు.