భూ యజమానులు కౌలుకు భూములను అప్పగించవచ్చు

84చూసినవారు
భూ యజమానులు కౌలుకు భూములను అప్పగించవచ్చు
కౌలు రైతులకు ఏడాది పాటు సాగు చేసేందుకు గాను భూ యజమానులు కౌలుకు అప్పగించవచ్చునని దీనివలన ఎటువంటి ఇబ్బందులు రావని రెవెన్యూ కార్యదర్శి ఎం అప్పలనాయుడు సూచించారు. గురువారం నరసన్నపేట మండలంలోని మూడవ సచివాలయ పరిధిలో భూ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతులకు భూములు ఇవ్వడం వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ అధికారి హారిక, ఏపీఎం హేమ సుందర్ రావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్