నరసన్నపేట మండలం దేవాది గ్రామం వద్ద పేకాట ఆడుతున్న శిబిరంపై పోలీసులు దాడి చేసి పదిమందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ముందస్తు సమాచారం అందుకొని తమ సిబ్బందితో మెరుపు దాడి నిర్వహించమన్నారు. ఈ దాడిలో భాగంగా 6, 890 రూపాయలు నగదు తో పాటు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుందామని స్పష్టం చేశారు. ఇప్పటికే మండలంలో ఇటువంటి శిబిరాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.