నరసన్నపేటలో వరాహ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు

64చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న జగన్నాథ యాత్ర ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారు వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు చామర్తి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ. విష్ణుమూర్తి 21 అవతారాలలో భక్తులకు దర్శనం ఇచ్చేవారని, దానిలో ప్రథమంగా దశ అవతారాలకే ప్రాధాన్యత కల్పించారని వివరించారు. ఈ క్రమంలో స్వామివారికి పూజలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్