మబగాం: శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

72చూసినవారు
శ్రీముఖలింగేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి ఆహ్వానం అందింది. బుధవారం ఉదయం శ్రీముఖలింగం సర్పంచ్ సతీష్ కుమార్, వేద పండితులు కలిసి పోలాకి మండలం మబగాంలో ఎమ్మెల్యేను కలిసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాది దీనిపై దృష్టి సారిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్