జలుమూరు మండలం సురవరంలో ఆదివారం చోరీ జరిగింది. సురవరం గ్రామానికి చెందిన శివప్రసాద్ వృత్తిరీత్యా శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. ఆయన తల్లి గ్రామంలో ఉండేది. ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని చిన్నకుమారుడి వద్దకు వెళ్లింది. శివప్రసాద్ ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని రూ. 9 లక్షల నగదు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.