మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి

67చూసినవారు
మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి
నూతన విద్యాసంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం, రుచికరమైన భోజనం అందించాలనిఎంఈవోలు బమ్మిడి మాధవరావు, బి. వి. ఎస్. ప్రసాదరావు పేర్కొన్నారు. జలుమూరు మండలంలో మధ్యాహ్న భోజనం వంట నిర్వాహకులతో బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ బి. ఉత్తర, సీఆర్పీలు పి. వైకుంఠరావు, రవికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్