కాశీబుగ్గలో దివంగత నేత, మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అప్పయ్య దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వజ్జ బాబూరావు, హనుమంతు మురళీ, లొడగల కామేశ్వరరావు, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, దువ్వాడ హేమబాబు చౌదరి, గొళ్ళ చంద్రరావు, డొక్కరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.