ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా తప్పనిసరిగా మెనూ పాటించాలని ఎంఈఓ పేడాడ దాలినాయుడు ఆదేశించారు. బుధవారం నరసన్నపేట మండలం జమ్ము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట ఏజెన్సీ మహిళా సభ్యులకు పలు సూచనలు చేశారు. వ్యాధులు వ్యాపిస్తున్న తరుణంలో వేడి ఆహారాన్ని విద్యార్థులకు అందజేయాలని ఆయన ఆదేశించారు.