నరసన్నపేట మండలం రావులవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడ్మిషన్లు జోరుగా కొనసాగుతున్నాయని ఉపాధ్యాయులు ఎం లక్ష్మీనారాయణ, బమ్మిడి శ్రీరామ్ మూర్తి, కొర్ను పావని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం 13 మంది విద్యార్థులు తమ పాఠశాలలో చేరేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. వారు మాట్లాడుతూ ఇది ఎంతో అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. విద్యతో పాటు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు తమ పాఠశాలలో ఉన్నాయన్నారు.