ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా నరసన్నపేట మండలంలో 1352 అర్జీలు వచ్చాయని తహసీల్దార్ టి సత్యనారాయణ తెలిపారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 105 రోజుల్లో వీటిని పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటికి 30 రోజులు పూర్తి అయ్యిందని స్పష్టం చేశారు. త్వరితగతిన అర్జీలను పరిష్కరిస్తామన్నారు.