ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల వద్ద నుండి అదనంగా ధాన్యం డిమాండ్ చేస్తే చర్యలు తీసుకోవడం తప్పదని డిఎస్ఓ సూర్య ప్రకాష్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం నరసన్నపేటలోని పలు రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని వివరించారు. తేమ శాతం పేరుతో అదనంగా ధాన్యం వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.