రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ప్రవేశ పరీక్షలలో భాగంగా ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదల అయ్యాయి. నరసన్నపేట కు చెందిన అడపా విజయ్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించుకున్నాడు. ఈయన తండ్రి లారీ డ్రైవర్ కాగా తల్లి గృహిణి. పదో తరగతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకోగా, ఇంటర్ ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నాడు. విజయం సాధించిన విజయకు పలువురు అభినందనలు తెలిపారు.