నరసన్నపేట ప్రాజెక్టులోని నరసన్నపేట, పోలాకి మండలాలలో అంగన్వాడి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పీఓ శోభారాణి తెలిపారు. గురువారం ఉదయం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ నరసన్నపేట మండలం కామేశ్వరి పేటలో మినీ అంగన్వాడి కార్యకర్త, పోలాకి మండలంలో అంబీరుపేటలో అంగన్వాడీ కార్యకర్త, మునసబు పేటలో మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు.