పారిశుధ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పరుచుకోవాలని అప్పుడే గ్రామాలు సంపూర్ణ ఆరోగ్యంగా కొనసాగుతాయని జిల్లా వ్యవసాయ శాఖ జెడి త్రినాధ స్వామి పేర్కొన్నారు. శనివారం నరసన్నపేట మండలం మాకివలస పంచాయతీలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రామస్తులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ స్థానిక చేపట్టారు. పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.