నరసన్నపేట మండలం కిళ్లాం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట శ్రీ గీత మండలి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు సూరిబాబు మహిళా సభ్యులతో సామూహిక భగవద్గీత పారాయణం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.