జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నరసన్నపేట మండలంలో గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ బస్తాలను పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదనరావు తెలిపారు. శుక్రవారం పలు పంచాయతీలకు బ్లీచింగ్ బస్తాలను అదించామని ఆయన పేర్కొన్నారు. 160 బస్తాలు బ్లీచింగ్ బస్తాలు వచ్చాయని వీటిని గ్రామాలలో వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి రేణుక, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.