నరసన్నపేటలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన చేపడుతున్నామని ఎంఎల్ఎస్ డిప్యూటీ తహసీల్దార్ సంధ్య తెలిపారు. బుధవారం నరసన్నపేటలో 82 పాఠశాలలకు 25 కేజీల 456 ప్యాకెట్లు, పోలాకిలో 95 పాఠశాలలకు 393 ప్యాకెట్లు, జలుమూరులో 78 పాఠశాలలకు 341 ప్యాకెట్లు, సారవకోటలో 51 పాఠశాలలకు 346 ప్యాకెట్లను పంపిణీ చేశామన్నారు. దీంతో పాటుగా రాగి జావా కూడా అందజేశామన్నారు.