రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలకు టాయిలెట్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామని ఎంఈఓ ఉప్పాడ శాంతారావు తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో పాఠశాలల హెచ్ఎం లకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం వీటిని అందజేస్తుందని వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో రెండవ విడత పంపిణీ చేస్తున్నామన్నారు.