జిల్లా వైసీపీ కొత్త కమిటీ సభ్యుల జాబితాను అదిష్ఠానం ఇటీవల విడుదల చేసింది. ఈ క్రమంలో శనివారం మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేటలో జరిగిన సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. జిల్లా కమిటీలో నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులకు అవకాశం కల్పించిందని వివరించారు. జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.