నరసన్నపేట మండల కేంద్రాన్ని ఎంఎల్‌ఎస్ గోదాంను జిల్లా మేనేజర్ టి.వేణుగోపాల్ మంగళవారం పరిశీలించారు. ఆయన నిల్వల పరిస్థితిని పరిశీలించి, ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్న సన్నబియ్యం వివరాలు తెలుసుకున్నారు. డీటీ సంధ్య తెలిపిన వివరాల ప్రకారం, నరసన్నపేట, జలుమూరు మండలాల్లోని 179 పాఠశాలలకు 1,417 బియ్యం బ్యాగులు పంపిణీ చేస్తున్నారు.