పండగ వేళ జూదం, కోడిపందాలు, పొట్టేలు పందేల వైపు దృష్టి సారించవద్దని నరసన్నపేట సిఐ జె శ్రీనివాసరావు, ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ హెచ్చరించారు. శనివారం రాత్రి నరసన్నపేట మండలం లుకలాం పంచాయతీలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో స్థానిక గ్రామంలో కోడి పందాలు నిర్వహించిన సందర్భంగా కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.