నరసన్నపేట: చిన్న ఉద్యోగం కదా అని దూరం చేసుకోవద్దు.. ఎమ్మెల్యే

50చూసినవారు
నిరుద్యోగులు చిన్న ఉద్యోగమని వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోవద్దని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. శుక్రవారం నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగం చిన్నది అయినా అనుభవాన్ని పెంచుకోవచ్చని తద్వారా పెద్ద పరిశ్రమలలో ఉద్యోగాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్