రాజ్యాంగ నిర్మాత, బడుగు, నిమ్న జాతుల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కొనియాడారు. ఆయన 134వ జయంతి సందర్భంగా సోమవారం నరసన్నపేట లోని కళాశాల కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆయన రచించిన రాజ్యాంగం నేటికీ కొనసాగుతుండడం ఆయనకు మనం ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.