స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కల్పనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. శనివారం నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర ర్యాలీలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఇంటిలోని చెత్తను బయట రహదారిపై పడి వేయకుండా ఒక బుట్టలో వేసుకుని పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు.