రబీ పంటలో భాగంగా రైతులు యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని వ్యవసాయ శాఖ అధికారిని కే సునీత తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం సత్యవరం రైతు సేవా కేంద్రంలో రైతులతో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు అపరాలకు సంబంధించిన విత్తనాలను అందించడం జరిగిందని తెలియజేశారు. చీడ పీడలు పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు.