వాతావరణం లో మార్పు వలన వచ్చే భారీ వర్షాలతో రైతులు ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని తహసిల్దార్ టి సత్యనారాయణ, డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణారావు సూచించారు. గురువారం నరసన్నపేట మండలం మాకివలస పంచాయతీలో రైతులతో మాట్లాడారు. బయట ఉన్న ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. పొలాల్లో ఉన్న వరిచేలను కుప్పలుగా ఉంచి భద్రపరుచుకోవాలని అన్నారు.