తాగునీటి వనరులపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం లుకలాం పంచాయతీ వద్ద వంశధార నది పరివాహక ప్రాంతంలోని రక్షిత మంచినీటి పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈ పథకంతో 11 పంచాయతీలకు 30 గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో బొడ్డేపల్లి మధుసూదన రావు పాల్గొన్నారు.