జమ్ములో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహణ

85చూసినవారు
నరసన్నపేట మండలం జమ్మూ పంచాయతీ లోని స్థానిక సచివాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని చేపట్టామని మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నేత్ర శస్త్ర సహాయ నిపుణులు వైశ్యరాజు గంగాధర్ రాజు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఈ శిబిరంలో భాగంగా 42 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించామని వివరించారు. వీరిలో నలుగురికి కాట్రాక్ట్ ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వీరికి ఉచితంగా శస్త్ర చికిత్స చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్