స్వయం శక్తి మహిళా సంఘాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన పేర్కొన్నారు. నరసన్నపేట వెలుగు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మహిళా సంఘాల సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ నేడు బ్యాంకుల ద్వారా లక్షలాది రూపాయలు మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.