సంక్రాంతి పండుగలు సందర్భంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం నరసన్నపేట పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి సమాచారాన్ని పోలీసులకు అందజేసినట్లయితే తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.