నరసన్నపేట: ఎస్జిఎఫ్ క్రికెట్ జాతీయ జట్టుకు జోష్మిత్ ఎంపిక

62చూసినవారు
నరసన్నపేట: ఎస్జిఎఫ్ క్రికెట్ జాతీయ జట్టుకు జోష్మిత్ ఎంపిక
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో భాగంగా అండర్ 14 క్రికెట్ టీంలో జాతీయ జట్టుకు నరసన్నపేట పట్టణానికి చెందిన విద్యార్థి తుంగాన జోష్మిత్ ఎంపికయ్యారు. అమలాపురంలో గత ఏడాది డిసెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరిగిన మీట్ సెలక్షన్ లో భాగంగా జోష్మిత్ ఎంపికయ్యారు. ఈయన తండ్రి తుంగాన ఆనంద్ వ్యాయామ ఉపాధ్యాయుడిగా సత్యవరంలో విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సునీత గృహిణి. ఈ సందర్భంగా పలువురు జోష్మిత్తును అభినందించారు.

సంబంధిత పోస్ట్