ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం నడగాం పంచాయతీలో నిర్వహిస్తున్న భూ సర్వేను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూ వివరాలను పూర్తిస్థాయిలో నివేదించి సమస్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ టి సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.