సమాజంలో ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ కృషి చేస్తుందని లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్.వి.బి.ఎస్.ఎస్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక వర్తకుల సంఘ భవనంలో మూడవ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సేవలను మరింత విస్తృతం చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నరసన్నపేట లయన్స్ సభ్యులు రంగనాథ్, తదితర సభ్యులు పాల్గొన్నారు.