శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ట్రెజరర్ గా నరసన్నపేటకు చెందిన రైస్ మిల్లర్ యజమాని తంగుడు నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆయన నరసన్నపేటలో మాట్లాడుతూ ఈ అవకాశాన్ని తనకు కల్పించడం ఆనందదాయకంగా ఉందన్నారు. శక్తి వంచన లేకుండా మిల్లర్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మిల్లర్ల అసోసియేషన్ సంఘ సభ్యులు, స్థానిక మిల్లర్లు, తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.